BHPL: మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ద్వంద వైఖరిని బయటపెట్టిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. భూపాలపల్లిలో మీడియాతో ఆమె మాట్లాడుతూ… నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని, కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మహిళలు తగిన బుద్ధి చెప్తారన్నారు.