JN: చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి కళ్యాణం ఇవాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ఈవో బీ.లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్, సౌమిత్రి శ్రీరంగా, కృష్ణమాచార్యులు కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణం తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.