ELR: కైకలూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో 15 రోజుల పాటు నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లులు, ఆరేళ్లలోపు పిల్లల పోషణ మెరుగుదలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తృణధాన్యాల వినియోగం, వైవిధ్యభరితమైన ఆహారం ప్రాముఖ్యతను వివరించారు.