ADB: ‘జనగణన-2026’ ప్రక్రియలో అత్యంత కీలకమైన ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానం ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జనగణనపై కలెక్టర్ సమీక్షించారు. మే 10వ తేదీ వరకు పౌరులు తమ వివరాలను వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు.