KDP: బ్రహ్మంగారి మఠంలో జరుగుతున్న గురుపూజ మహోత్సవాలకు వచ్చే భక్తులకు ప్రస్తుతం మఠం పరిసరాల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదని నిర్వాహకులు తెలిపారు. దీంతో వాహనాలతో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి బైక్లు, కార్లు, ఇతర వాహనాల్లో వచ్చే భక్తులు తమ ప్రాంతాల్లోనే సరిపడా ఇంధనం నింపుకొని రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.