JN: పరిసరాల పరిశుభ్రతతో మలేరియాను నివారించవచ్చునని కోమటిగూడెం గ్రామ సర్పంచ్ సోమయ్య అన్నారు. శనివారం ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీని నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. నీరు నిల్వ ఉండడంతో దోమల బెడద ఎక్కువై మలేరియా వస్తుందని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.