MDK: రామాయంపేట మండలం ఐసీడీఎస్ 8వ పోషణ్ పఖ్వాడా కార్యక్రమానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ చిన్నారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. విద్యార్థుల సృజనాత్మకత, ప్రతిభ పట్ల రోహిత్ రావు హర్షం వ్యక్తం చేశారు. పోషకాహార విలువలపై చిన్నారులు ప్రదర్శించిన అంశాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.