AP: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టోల్ సిబ్బందిపై టీడీపీ MLA అమిలినేని అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో టోల్ ప్లాజాలోని మహిళా సిబ్బందికి గాయాలయ్యాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వాహనాన్ని ఆపడంతో ఈ వివాదం చెలరేగింది. మేనేజర్ రవిని కొట్టిన ఎమ్మెల్యే అనుచరులు కారులో ఎత్తుకెళ్లారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.