EG: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని జనసేన సిటీ కార్యాలయం వద్ద మేకల సునీల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ అనుశ్రీ సత్యనారాయణ మజ్జిగ పంపిణి చేపట్టారు. అధినేత త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లంశెట్టి వీరబాబు, విన్న వాసు, బోయలపల్లి సుందరయ్య, శంకర్ పాల్గొన్నారు.