AP: కొల్లేరు సమస్యకు పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కొల్లేరు అభయారణ్య సరిహద్దులపై కీలక నిర్ణయం తీసుకుంది. అభయారణ్యం పరిధి నుంచి 20 వేల ఎకరాలను మినహాయించాలని సీఈసీకి లేఖ రాసింది. దీంతో 136 గ్రామాల ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. కేంద్ర కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.