JGL: మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో పెద్ద జయంతి సందర్భంగా భక్తులు సమర్పించిన ముడుపుల వేలం ద్వారా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం సమకూరింది. నిన్న జరిగిన వేలంలో మాలలను వనం అంజి రూ.5.90 లక్షలకు, బియ్యాన్ని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ కిలో రూ.15కు, కొబ్బరికాయలను ప్రభాకర్ రూ.51 వేలకు, ఎండు కూడకలను పుత్తూరి సమ్మయ్య దక్కించుకున్నారు.