AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ ఈదురుగాలులకు విద్యుత్ లైన్లు తెగిపడటంతో NTR, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు మరణించారు. దాదాపు 20 జిల్లాల్లో వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి, బీర, మునగ, మామిడి తదితర పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా వేశారు. వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో గంటలపాటు అంధకారం నెలకొంది.