JGL: మహిళా వారోత్సవాల్లో భాగంగా ఐసీడీసీ ఆధ్వర్యంలో మల్యాల మండల కేంద్రంలో శుక్రవారం బాల్యారంభ వెయ్యి రోజుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గర్భం నుంచి 2 ఏళ్ల వరకు గల కాలంలో 80% మెదడు అభివృద్ధి చెందుతుందని, ముర్రుపాలు, 6 నెలలు తల్లిపాలు, 7వ నెల నుంచి అనుబంధ ఆహారం ఇవ్వాలన్నారు. ప్రతి నెలా బరువు, ఎత్తులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, సీడీపీవో,పాల్గొన్నారు.