GDWL: యువత పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే విజయం సాధ్యమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అనారు. శుక్రవారం గద్వాల అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ATC)లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణలను, సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ఎదగాలన్నారు.