SDPT: నంగునూరు మండల నూతన విద్యాధికారిగా పి. శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. మండలంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనుముల వీరేశం, పలువురు ఉపాధ్యా యులు పాల్గొన్నారు.