TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జనగణన ప్రారంభం కానుంది. తొలి విడతలో మే 10 వరకు స్వీయ జనగణన, ఆ తర్వాత రెండో విడతలో ఇళ్లవారీ గణన ఉంటుంది. అయితే ఈ స్వీయ గణన ఆప్షనల్ మాత్రమే, తప్పనిసరి కాదు. ఇందులో 33 ప్రశ్నలు ఉండగా.. ప్రజలు 27 ప్రశ్నలకు బదులిస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 15-20 నిమిషాలు పడుతుంది.