KNR: చిగురుమామిడి మండలం ముల్కనూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ఉత్సాహంగా సాగింది. ప్రధానోపాధ్యాయురాలు శారద ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు గ్రామ సర్పంచ్ భారతమ్మ హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైయర్‌ను ప్రారంభించారు.