KMR: భిక్కనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. అందులోని కూలర్లు, కేబుల్ వైర్లను దొంగలించుకుపోయినట్లు ఉదయం విధులకు వెళ్లిన వ్యవసాయం శాఖ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.