KNR: ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. వేములవాడ డిపో ఎదుట సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు. ప్రభుత్వం పట్టింపులకు పోవద్దని విజ్ఞప్తి చేశారు.