NZB: జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని CPI(ML) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతుసంఘం రాష్ట్ర కార్య దర్శి దేవారం డిమాండ్ చేశారు. శుక్రవారం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వరి, కూరగాయల వివిధ రకాల పంటలు 50% పైగా దెబ్బతిన్నాయన్నారు.