NLG: మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీసుల తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. నాగార్జునసాగర్ కేంద్రంగా పోలీసుల అండదండలతోనే పేకాట సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్ కావడంతో పాటు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో డీజీపీ సైతం స్పందిస్తూ డీఎస్పీ రాజశేఖర్ రాజు, సాగర్, పెద్దవూర ఎస్ఐలపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.