గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ విడుదలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నేరాలను గ్లామరైజ్ చేయడం వల్ల యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని జీ5ని ఆదేశించింది. ఐటీ చట్టం కింద దీనిని నిలిపివేయాలని పోలీసులు కోరగా, దీని ట్రైలర్ను కూడా తొలగించారు.