SRD: కంగ్టి మండలం టోపా తండాలో వివాహిత శుక్రవారం సూసైడ్ చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. టోపా తాండకు చెందిన రాజు భార్య సునీత (28) కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఇవాళ ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకొని మృతి చెందింది. విషయం తెలుసుకున్న కంగ్టి పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.