ప్రకాశం: సంతనూతలపాడు మండలం ఎండ్లూరుడొంకలోని మహిళా ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీన మెగా జాబ్ మేళా జరగనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ శుక్రవారం తెలిపారు. ఈ జాబ్ మేళాకు మాక్సన్ హెల్త్ కేర్, TVS, టాటా ఎలక్ట్రానిక్స్, SBI, Joyalukkas, JK టైర్స్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. 500 పోస్టులకు నిరుద్యోగులు హాజరుకావాలని ఆయన కోరారు.