బాపట్ల జిల్లాలో నీటి సంరక్షణకు జలధార కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. వీసీ ద్వారా సమీక్షించి పనులు అనుమతులతో పూర్తి చేయాలన్నారు. భూగర్భ జలాల పెంపు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడంతో పాటు కార్యాలయాలు, పాఠశాలల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.