BDK: యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. విద్యార్థులు, గర్భిణులు, చిన్నారుల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు.