NDL: రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తహశీల్దార్ నాగవీణ శుక్రవారం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా క్యాన్లలో ఇంధనం నింపడం, నిల్వ చేయడంపై ఆంక్షలు విధించారు. బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల అవసరాల పేరుతో జరిగే అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు.