ఉబర్ కప్లో పీవీ సింధు ధరించిన ‘టెంపుల్’ అనే కొత్త వేరబుల్ పరికరం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ పరికరం మెదడులో రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇది క్రీడాకారుల ఏకాగ్రత, మానసిక అలసట, ఒత్తిడిని కొలుస్తూ ‘బ్రెయిన్ ఫిట్నెస్ ట్రాకర్’లా పనిచేస్తుంది.