SKLM: జలుమూరు మండలంలోని ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 40 పంచాయతీలకు చెత్త సేకరణ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నాయకులు, అధికారులు ఉన్నారు.