వొడాఫోన్ ఐడియా(Vi) తమ టారిఫ్ ప్లాన్ల ధరలపై కీలక స్పష్టత ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్లను భారీగా పెంచే ఆలోచన ప్రస్తుతం లేదని, కేవలం స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇటీవల ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను 4-5 శాతం పెంచడంతో, VI కూడా అదే బాటలో నడుస్తుందని వస్తున్న వార్తలకు దీనితో తెరపడింది. ఈ నిర్ణయం VI వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే అంశం.