MDK: నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు గత మూడు రోజులుగా సమ్మె నిర్వహిస్తుండగా తాత్కాలిక ఉద్యోగులతో అధికారులు బస్సులు నడుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చిన ఒక బస్సుకు అడ్డు వెళ్లిన కార్మికులు కాంట్రాక్ట్ డ్రైవర్, కండక్టర్‌తో తమ గోడు వెల్లబోసుకున్నారు.