దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ముందుగానే దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించొచ్చని ECMWF తాజాగా అంచనా వేసింది. మే నెలాఖరు నాటికి వర్షాలు కురవచ్చని తెలిపింది. 2025లో కూడా ముందుగానే రుతుపవనాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా మే 27-29 తేదీల్లో కురవచ్చని మౌసమ్ తక్ వ్యవస్థాపకుడు దేవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు.