MNCL: ప్రకృతి మిత్ర పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేంపల్లిలో సంస్థ ఫౌండర్ గుండేటి యోగేశ్వర్ అధ్యక్షతన భూగోళ సంరక్షణ.. మానవ బాధ్యత అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాలను, వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మించుకోవాలని కోరారు.