HNK: ఉపాధి హామీ కూలీల బిల్లులను వెంటనే చెల్లించాలని హసన్పర్తి ఎంపీడీవో కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. మండల కార్యదర్శి సుచందర్ మాట్లాడుతూ.. కూలీలు అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేసి కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.