TG: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త విప్లవం మొదలైందని జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా వందశాతం సీఎం అయ్యి తీరుతానని, రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదం ఇవ్వాలని ఆమె కోరారు. మేడ్చల్ జల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ హాల్లో ఇవాళ కవిత రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. పార్టీ ప్రకటన సభకు ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేశారు.