MDK: మూడు రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. మంత్రులు, ఆర్టీసీ సంఘాల జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విజయవంతం కావడంతో పటాన్చెరు, బిహెచ్ఎల్ తదితర డిపోల నుంచి తెల్లవారుజాము నుంచే బస్సులు యథావిధిగా రోడ్డెక్కాయి. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.