MBNR: జిల్లాలో మే 3న జరగనున్న నీట్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ ఖుష్బూ గుప్తా సమీక్షించారు. జిల్లాలోని 12 కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఏ (NTA) మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.