NLG: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హాలియా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పారిశుద్ధ పనులను మున్సిపల్ ఛైర్మన్ చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రాజా రమేష్ యాదవ్‌లు స్వయంగా పనులను పర్యవేక్షించారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డు ఆవరణలో పేరుకుపోయిన కంపచెట్లు, మట్టి కుప్పలను జేసీబీ సాయంతో తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు.