BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 2006-07 విద్యాసంవత్సరానికి చెందిన ఏడవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులను సన్మానించి, వారి సేవలను కొనియాడారు.