బాలీవుడ్ నటి అర్చన పూరన్ సింగ్ చిన్న కుమారుడు ఆయుష్మాన్ సేథీ ఆన్లైన్ క్రెడిట్ కార్డ్ మోసానికి గురై రూ. 87,000 కోల్పోయాడు. తన ప్రమేయం లేకుండానే ఖాతా నుంచి డబ్బు డెబిట్ కావడంతో అతను షాక్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని అతని సోదరుడు ఆర్యమాన్ తన వ్లాగ్‌లో వెల్లడిస్తూ.. ఆన్లైన్ లావాదేవీలు, గేమింగ్ సబ్స్క్రిప్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.