KMM: అక్రెడిటేషన్ దరఖాస్తుదారులు ఈ నెల 25లోగా ఒరిజినల్ మేనేజ్మెంట్ లేఖలను సమర్పించాలని ఖమ్మం డీపీఆర్ సూచించారు. గడువులోగా సమర్పించిన జర్నలిస్టులనే మొదటి జాబితాలో పరిగణనలోకి తీసుకుంటామని, ఆలస్యమైతే తదుపరి జాబితాకు మారుస్తామని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారు నేరుగా కార్యాలయంలో పత్రాలు అందజేయాలని, జిరాక్స్ ప్రతులను అంగీకరించమన్నారు.