KMR: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శుక్రవారం కలకలం రేగింది. తెల్గాపూర్ గ్రామానికి చెందిన కావ్య తన ఇద్దరు చిన్నారులతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగారు. వివాహానంతరం తలెత్తిన కుటుంబ గొడవల వల్ల అత్తమామలు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆమె ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామ పెద్దలు అక్కడికి చేరుకొని నచ్చజెప్పారు.