KMR: జిల్లాలో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయని DEO అధికారి రాజు తెలిపారు. ఓపెన్ పదో తరగతికి ఎకనామిక్స్ పరీక్షకు 2 పరీక్షా కేంద్రాల్లో ఇద్దరికి ఎవరు కూడా హాజరు కాలేదని ఆయన వెల్లడించారు. ఓపెన్ ఇంటర్‌కు జరిగిన ఎకనామిక్స్/బయాలజీ పరీక్షకు 8 పరీక్షా కేంద్రాల్లో 1,695 మందికి గాను 1,540 (91%) మంది హాజరు కాగా 155 మంది గైర్హాజరయ్యారన్నారు.