ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. మాడ్గులపల్లిలో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. అధిక ఎండల కారణంగా మధ్యాహ్నం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నివేదిక ప్రకారం మాడ్గులపల్లిలో 44.1, కీతవారిగూడెంలో 43.2, మామిళ్లగూడెంలో 43.0, సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.