AP: దోమల బెడద నుంచి జలవనరులను రక్షించేందుకు గుంటూరు జీఎంసీ అధికారులు మిషన్ మిస్కిటో పేరిట చర్యలు చేపట్టారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో AI బేస్ట్ డ్రోన్ల ద్వారా దోమల లార్వాను నాశనం చేసేందుకు నడుంబిగించారు. నగరవ్యాప్తంగా 26 ప్రధాన చెరువులు, మురుగునీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఈ డ్రోన్ ఆపరేషన్ సాగుతుందని అధికారులు తెలిపారు.