SRPT: నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన పంతం వెంకన్న (40), సూర్యాపేటలో మార్బుల్ పని చేసుకుంటూ జీవించేవాడు. సోమవారం రాత్రి చివ్వెంల నుంచి తిరిగి వస్తుండగా, ఐలాపురం ఫ్లై ఓవర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆయన ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్వర్ తెలిపారు.