WNP: పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.