TG: కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉండి ఉంటే మహిళలకు ఎప్పుడో రిజర్వేషన్లు వచ్చేవని బీజేపీ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ‘2029లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే లక్ష్యంతో బిల్లులు ప్రవేశపెట్టాం. కానీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఆ బిల్లులను వ్యతిరేకించి మహిళలను అవమానించారు. మహిళల ఆశలను అడియాసలు చేసిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు గుణపాఠం తప్పదు’ అంటూ హెచ్చరించారు.