ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మంగళవారం పరిశీలించారు. రాపర్తి నగర్ మెయిన్ రోడ్డులో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు, 17, 46వ డివిజన్లో అంతర్గత రహదారి, డ్రైనేజీ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. నగరంలో అభివృద్ధి పనులు పెండింగ్లో ఉండకూడదని సూచించారు. డ్రైనేజీ పనుల విషయంలో మే నెలాఖరు లోపు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.