ELR: 2016లో కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ పోక్సో కేసులో ముద్దాయి బెల్లాని నాని అనే వ్యక్తికి మచిలీపట్నం స్పెషల్ పోక్సో సెషన్స్ న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు 5 ఏళ్ల జైలు శిక్ష 2000 రూపాయల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.3,00,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు. నేరస్తులకు శిక్షలు పడటం వల్ల సమాజంలో నేరాలు తగ్గుతాయని తెలిపారు.